Wednesday, 12 November 2014

మగాడ్ని పడేయడం ఎలా

మీ ప్రియుడు మీ ధ్యాస మీదనే ఉండాలంటే మహిళ కొన్ని చిట్కాలు పాటించక తప్పదు. ఇరువురి మధ్య ఆకర్షణ ఎల్లకాలం నిలువాలంటే ొన్ని మెళుకవలు పాటించాలి. పరస్పరం ఎలా ఆకర్షించుకోవాలనే విషయంపై స్త్రీపురుషులు మథనపడుతుండడం సహజం.
ఒక్కసారి ప్రేమ మైకంలో పడ్డ జంట ఒకరికొకరు ఆకర్షించుకునేందుకు అనేక పద్ధతులను పాటిస్తారు. ముఖ్యంగా ప్రియురాలు పోయే గారాలు ఇన్నిన్ని కావని "ప్రేమికులు- చేష్టలు"పై అధ్యయనం చేసిన బృందం వెల్లడించింది. ప్రేయసి చెప్పే తీయటి కబుర్లు, ఆమె నిత్యం పొగిడే పొగడ్తలకు ప్రేమికుడు పడిపోవాల్సిందేనట.
మాటలతో, చేతలతో మహిళ తన పురుషుడిని తన కొంగుకు ముడేసుకోవడానికి రకరకాల పద్ధతులు అవలంబిస్తుందని చెప్పారు. ఎప్పటికీ అతను తన చుట్టే తిరిగేలా చేసుకోవడం కొంత మంది మహిళలకు వెన్నతో పెట్టిన విద్య అంటారు. అటువంటి స్త్రీలు పాటించే పద్ధతులు ఏమిటో చూద్దాం.
1. తీయ తేనియల పలుకులు
తన పురుషుడు చెప్పరాని బాధతో విలవిలలాడుతున్నప్పుడు ప్రేమ మైకాన్నంతా గొంతులోకి ఒంపుకుని తన తీయటి స్వరంతో తేనెలు కురిపించే మాటలతో అతడి దృష్టిని మళ్లించి, దరి చేర్చుకోవాలి.
2.ఆకర్షణీయమైన దుస్తులు
పురుషుడికి తెలియకుండా అతడికి ఇష్టమైన రంగులేమిటో తెలుసుకుని రంగు దుస్తులను ధరించాలి. ఇటువంటి చర్య అతన్ని మైమరిపిస్తుంది. అతన్ని ఇట్లే పడేస్తుంది.
3. ముద్దులతో మురిపెం..
సాయంత్రం వేళల్లో సమయం దొరికితే చాలు, అతడితో గంటల తరబడి అతనితో గడపడానికి చొరవ చూపుతుంది. సమావేశంలో తీయని ప్రేమ కబుర్లు చెప్పాలి. మాటలమధ్యలో అప్పుడప్పుడు అతడికి ముద్దులు, కౌగలింతలు రుచి చూపించాలి.
4.కళ్లతోనే కట్టిపడేయం
పురుషుడు పిలిచిన సమయానికి రాలేకపోయినప్పుడు అతనికి కోపం వచ్చే అవకాశం ఉంది. సమయాల్లో మత్తెక్కించే అత్తరు చల్లుకుని అతడు తనపై కోపాన్ని ప్రదర్శించక మునుపే తన కళ్ల ద్వారా ప్రేమ మైకాన్ని నింపి చుట్టేయాలి.
5.చల్లటి చేతి స్పర్శ
ఇది హృదయాన్నికట్టి పడేస్తుంది. ఇద్దరూ కలిసి వెళుతున్న సమయంలో ప్రేమికుని చేతిని తన చేతిలోకి తీసుకుని మృదువుగా నొక్కుతూ, మధ్యమధ్యలో గారాలు పోతూ ఉండాలి. అది అతడు ఆమెను వదల్లేని స్థితికి చేరుస్తుంది. స్పర్శ కోసం అతను మళ్లీ మళ్లీ చూస్తుంటాడు.
6.పూల పరిమళాలు..
పరిచయమైన తొలి రోజుల్లో లేదా పెళ్లయిన కొత్తలో మహిళ అన్ని రకాలు పుష్పాలను అలంకరించుకుంటుంది. వాటన్నిటిలో ఏదో ఒక రకమైన పుష్ప జాతులు అంటే తనకు ఇష్టమని ప్రియుడు చెపుతాడు. అతడు చెప్పిన పూల రకాలను ధరిస్తూ అతడి మదిని ఆకట్టుకోవాలి.
7.పెదవులతో రంగులద్ది..
నెలలో ఏదో ఒకరోజు అతని ఎదుటే పెదవులకు రంగులద్ది తన తీయటి అధరాలను అందించి మత్తెక్కించాలి. తీపి ముద్దు తాలూకు ముద్ర అతని ఎద లోతుల్లో నాటుకుంటుంది.



No comments:

Post a Comment